There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Thu Apr 24, 2025
పరిచయం:
19వ శతాబ్దం నాటి బ్రిటిష్ వలస పాలన ఆధిపత్యం, ముస్లిం రాజకీయ వ్యవస్థ బలహీనపడుట, మరియు సమాజంలోని అంతర్గత కలహాల నేపథ్యంలో ఆవిర్భవించిన ముస్లిం సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలు మతాచారాలను, సామాజిక విలువలను సంస్కరించడం, మరియు ఆధునిక సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనడం మొదలైనవి లక్ష్యాలుగా పెట్టుకున్నాయి.
విషయం:
ముస్లిం సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలు
1. సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమం:
a. ఇస్లాం విలువలతో కూడిన ఆధునిక శాస్త్రీయ విద్యను ప్రోత్సహించారు.
b. 1875లో మొహమ్మదీయ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. ఇది తర్వాత అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయంగా మారింది.
c. ఖురాన్‌ను హేతుబద్ధంగా వివరించే గ్రంథాన్ని (తఫ్సీర్-ఉల్-ఖురాన్) రచించారు.
d. 1857 తర్వాత ముస్లింల భద్రత కోసం బ్రిటిష్ పాలనకు విధేయతను ప్రకటించారు.
2. దియోబంద్ ఉద్యమం (1866):
a. ఆధ్యాత్మిక సంస్కరణలు మరియు సాంప్రదాయ ముస్లిం విద్యపై దృష్టి సారించింది.
b. ముస్లిం సాంప్రదాయ విద్య కోసం దారుల్ ఉలూం అనే మదరసాను స్థాపించారు.
c. పాశ్చాత్యీకరణను తిరస్కరించినప్పటికీ, తర్వాత కాలంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించారు.
3. అహ్మదీయ ఉద్యమం (1889):
a. మిర్జా గులామ్ అహ్మద్ స్థాపించారు. ఇస్లాం యొక్క శాంతియుత విధానాన్ని ప్రచారం చేసింది.
b. ఇస్లాం సూత్రాలను సార్వత్రిక నైతిక విలువలతో కూడిన శాంతియుత సహజీవనానికి మార్గంగా ప్రకటించారు.
4. వహాబీ/తెహ్రీ ఉద్యమం:
a. ప్రారంభ ఇస్లామీయ ఆచారాలను పునరుద్ధరించింది. అలాగే నూతన ఆచారాలను (బిద్అహ్) తిరస్కరించింది.
b. బ్రిటిష్ పాలనకు మరియు అంతర్గత అనైతిక ఆచారాలను వ్యతిరేకించారు.
5. ఫరాజీ ఉద్యమం (19వ శతాబ్దం ఆరంభం నుండి):
a. బెంగాల్‌లో హాజీ షరియతుల్లా నాయకత్వం వహించారు.
b. ఇస్లాం మత కర్తవ్యాలను (ఫరాయిజ్) తప్పనిసరిగా పాటించాలని ప్రచారం చేశారు. ఇస్లామేతర ఆచారాలను వ్యతిరేకించారు. అలాగే బ్రిటిష్ వారి వ్యవసాయ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు.
సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క సహకారం
1. విద్యా సంస్కర్త:
a. ముస్లింలలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టిన మార్గదర్శి. ఆధునిక శాస్త్రాలు మరియు ఇస్లామీయ నైతిక విలువలను కలిపి బోధించేందుకు నూతన విద్యా సంస్థలను స్థాపించారు.
2. మత ఆధునికవాది:
a. ఖురాన్‌ను హేతుబద్ధంగా వివరించడాన్ని ప్రోత్సహించారు.
b. తక్లీద్ మరియు మత దురాచారాలను వ్యతిరేకించారు.
3. సామాజిక సంస్కర్త:
a. మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ, మహిళా విద్యకు ప్రాధాన్యతను ఇచ్చారు. బహు భార్యత్వం, పరదా పద్ధతి వంటి సంప్రదాయాలను తీవ్రంగా విమర్శించారు.
4. రాజకీయ ఆలోచన:
a. ప్రారంభంలో హిందూ–ముస్లిం ఐక్యతకు మద్దతు తెలిపినా, తరువాత సమాజంలో ముస్లింల యొక్క ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడారు.
5. సాహిత్య సేవ:
a. 1857 గదర్ (సిపాయిల తిరుగుబాటు)కు కారణాలను విశ్లేషిస్తూ ‘అస్బాబ్-ఎ-బఘావత్-ఎ-హింద్’ గ్రంథాన్ని రచించారు. ఈ తిరుగుబాటుకు బ్రిటీషు పాలనా వైఫల్యాలే ప్రధాన కారణమని భావించారు.
b. 1864లో సైంటిఫిక్ సొసైటీని స్థాపించి, పాశ్చాత్య గ్రంథాలను ఉర్దూకు అనువదించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ముస్లింలకు జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముగింపు
19వ శతాబ్దపు ముస్లిం సంస్కరణా ఉద్యమాలు సంప్రదాయవాదం నుంచి ఆధునికత వైపుగా ముస్లిం సమాజాన్ని నడిపించాయి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క దూరదృష్టి, సమర్ధత మరియు విద్య రాజకీయ రంగాలలో ఆయన చేసిన కృషి, ముస్లింలను వలస పాలనలో తలెత్తిన సవాళ్లకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
Additional Embellishment: