There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun Apr 20, 2025
పరిచయం:
బ్రిటిష్ వలస పాలనలో, భారతీయ రైతులు ఆర్థిక దోపిడీని మాత్రమే కాకుండా సామాజిక సమస్యలు మరియు నిరాశా నిస్పృహలను కూడా ఎదుర్కొన్నారు. దీనబంధు మిత్రా రచించిన ప్రసిద్ధ నాటకం నీల్ దర్పణ్ (1860) యూరోపియన్ సాగుదారులచే నీలిమందు రైతులకు జరిగిన అన్యాయాన్ని మరియు వలస పాలకులకు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటాలను ఎంతో చక్కగా వివరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొదలైన ఈ రైతు ఉద్యమాలు భారత స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించడమేగాక తరువాత కాలంలో వ్యవసాయ రంగంలోని ప్రధాన మార్పులకు ఎంతగానో దోహదపడ్డాయి.
విషయం:
కాలం |
ఉద్యమం |
ప్రాంతం | నాయకులు/స్వభావం | ప్రధాన లక్షణాలు |
1857కి ముందు | నర్కెల్‌బెరియా తిరుగుబాటు (1831) | బెంగాల్ | తీతూ మీర్ – మతపరమైన మరియు జమీందారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం | జమీందారుల అణచివేతకు వ్యతిరేకంగా మతపరమైన స్ఫూర్తి తో సాగిన పోరాటం |
మోపిల్ల తిరుగుబాట్లు (1836–1854) | మలబార్ (కేరళ) | స్థానిక నాయకులు, హింసాత్మక ఘటనలు | మత విశ్వాసాలతో వ్యవసాయ సంక్షోభానికి వ్యతిరేకంగా సాగింది. | |
1857 తర్వాత | ఇండిగో తిరుగుబాటు (1859–1860) | బెంగాల్ | దిగంబర్ బిస్వాస్, బిష్ణు బిస్వాస్ | ఐరోపాకు చెందిన ఇండిగో పెంపకందారుల దోపిడీకి వ్యతిరేకంగా అహింసాత్మక నిరసన |
పబ్నా ఉద్యమం (1873–1885) | బెంగాల్ | స్థానిక రైతు నాయకులు | జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా చట్టపరమైన పద్ధతులు ఉపయోగించారు | |
దక్కన్ అల్లర్లు (1875) | మహారాష్ట్ర | వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు చేసిన తిరుగుబాటు | దక్కన్ వ్యవసాయదారుల సహాయ చట్టం వంటి సహాయ చర్యలకు దారితీసింది | |
1920లు | కిసాన్ సభ ఉద్యమం | ఉత్తర ప్రదేశ్ | బాబా రామచంద్ర | కౌలుదారుల హక్కులు మరియు భూ సంస్కరణల కోసం సాగిన పోరాటం |
ఏక ఉద్యమం | అవధ్ (ఉత్తర ప్రదేశ్) | చిన్న భూస్వాములు మరియు కౌలుదారులు | అధిక కౌలు మరియు జమీందారుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటం | |
మోప్లా తిరుగుబాటు (1921) | మలబార్ (కేరళ) | వ్యవసాయ మరియు మతపరమైన స్వభావం | సామాజిక-ఆర్థిక సమస్యల కారణంగా గ్రామీణ ముస్లిం రైతుల హింసాత్మక తిరుగుబాటు | |
బర్దోలీ సత్యాగ్రహం (1928) | గుజరాత్ | సర్దార్ వల్లభాయ్ పటేల్ | అన్యాయమైన పన్ను పెంపునకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన | |
1930లు–1940లు | అఖిల భారత కిసాన్ సభ (1936) | దేశవ్యాప్తంగా సాగింది | సహజానంద సరస్వతి, సీపీఐ | రైతు ఆందోళనలను చర్చించే జాతీయ వేదిక ఏర్పాటు |
తెభాగా ఉద్యమం (1946) |
బెంగాల్ | కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో | సాగు రైతులు సగం కాకుండా మూడింట రెండు వంతుల దిగుబడిని డిమాండ్ చేశారు. | |
తెలంగాణ తిరుగుబాటు (1946) | హైదరాబాద్ (నిజాం పాలనలో) | కమ్యూనిస్టుల నేతృత్వంలో రైతాంగ సాయుధ తిరుగుబాటు | భూ పునర్విభజన మరియు భూస్వామ్య జమీందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం |
రైతాంగ తిరుబాట్లు - వాటి ప్రభావం
1. గ్రామీణ ప్రజానీకాన్ని చైతన్య పరచడం
-రైతాంగ ఉద్యమాలు గ్రామీణ సమాజంలోని విస్తృత వర్గాలను రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
-ఉదాహరణ: ఉత్తర ప్రదేశ్‌లోని కిసాన్ సభ ఉద్యమం కౌలు రైతులను ఒక తాటి పైకి చేర్చింది.
2. రైతులలో రాజకీయ చైతన్యం
-ఈ ఉద్యమాల ద్వారా రైతులు తమపై జరుగుతున్న దోపిడీని అర్థం చేసుకోవడమేగాక, వారి హక్కుల పరిరక్షణ కొరకై రాజ్యాంగ ప్రాతినిధ్యం ముఖ్యమని భావించడం మొదలుపెట్టారు.
-ఉదాహరణ: 1936లో స్థాపితమైన అఖిల భారత కిసాన్ సభ రైతు పోరాటాలకు స్పష్టమైన సైద్ధాంతిక మార్గాన్ని అందించింది. 3. జాతీయ నాయకులకు మద్దతు
-రైతు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న నాయకులు ప్రజా మద్దతును సంపాదించి, జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తులుగా మారారు.
-ఉదాహరణ: బర్దోలీ సత్యాగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఖ్యాతిని పెంచడమే గాక జాతీయ స్థాయిలో ఒక సమర్ధవంతమైన నాయకునిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించింది.
4. జాతీయోద్యమ విస్తరణ
-రైతు ఉద్యమాలు జాతీయోద్యమం కేవలం పట్టణ ప్రాంతాలకు లేదా ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషించాయి. గ్రామీణ ప్రజానీకాన్ని కూడా స్వాతత్రోద్యమంలో భాగం చేసాయి.
-ఉదాహరణ: ఇండిగో తిరుగుబాటు మరియు పబ్నా ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో బ్రిటిషు వ్యతిరేక అసంతృప్తిని బయట పెట్టాయి.
సామాజిక-ఆర్థిక ప్రభావం
1. బ్రిటీషు వ్యవసాయ విధానాలకు వ్యతిరేకత
-రైతు ఉద్యమాలు ఆంగ్లేయుల అన్యాయమైన వ్యవసాయ విధానాలు మరియు భూ శిస్తు విధానాలను వ్యతిరేకించాయి.
-ఉదాహరణ: బర్దోలీ సత్యాగ్రహం అనేది భూమి పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ నిర్వహించిన విజయవంతమైన కార్యక్రమం.
2. ఆర్థిక జాతీయవాదం
-ఈ ఉద్యమాలు స్థానిక సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా, వలసవాద ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా విస్తృతమైన చర్చలను లేవనెత్తాయి.
-ఉదాహరణ: ఇండిగో తిరుగుబాటు బ్రిటిష్ ప్లాంటర్లచే బలవంతంగా సాగించే నీలిమందు సాగును వ్యతిరేకించి, రైతులు వాణిజ్య పంటలకు బదులుగా ఆహార పంటలను పండించే హక్కును అందించింది.
3. సోషలిస్ట్ మరియు కమ్యూనిస్ట్ భావజాలాల వ్యాప్తి
-1940వ దశకంలో, అనేక రైతు ఉద్యమాలు వలసవాద పాలన మరియు స్థానిక భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా సామ్యవాద భావజాలాలకు మద్దతు పలికాయి.
-ఉదాహరణ: తెభాగా మరియు తెలంగాణ ఉద్యమాలు భూ సంస్కరలను డిమాండ్ చేసాయి.
4. స్వాతంత్ర్యానంతర భూ సంస్కరణలకు పునాది
-ఈ ఉద్యమాలు ద్వారా రైతులు లేవనెత్తిన డిమాండ్లు మరియు విస్తృతమైన చర్చలు స్వాతంత్ర్య భారతదేశంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టబడడానికి కారణమయ్యాయి.
-ఉదాహరణ: తెలంగాణ తిరుగుబాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణ చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
ముగింపు:
రైతు ఉద్యమాలు గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా భారత జాతీయోద్యమాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. వలసవాద దోపిడీని వ్యతిరేస్తూనే గ్రామీణ స్థాయిలో రాజకీయ చైతన్యం సాధ్యపడేలా చేశాయి. “భారత స్వాతంత్య్ర సమరంలో కలం మరియు ఖడ్గం అంతటి శక్తివంతమైన ఆయుధాలకు ఏ మాత్రం తీసిపోకుండా నాగలి కూడా ముఖ్య పాత్ర పోషించింది" అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Additional Embellishment: