TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Thu Apr 24, 2025

Q. "19వ శతాబ్దపు భారతదేశంలో వ్యవసాయ వాణిజ్యీకరణ సాంకేతిక అభివృద్ధికి దారితీయలేదు." పై ప్రకటనను పరిశీలించండి.

పరిచయం:
దాదాభాయి నౌరోజీ తన "పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" గ్రంథంలో చెప్పినట్లుగా, బ్రిటిష్ పాలన భారతదేశ సంపదను దోచుకుందే తప్ప, దేశాభివృద్ధికి ఎలాంటి తోడ్పాటును అందించలేదు.19వ శతాబ్దంలో మొదలైన వ్యవసాయ వాణిజ్యీకరణ బ్రిటీషు సామ్రాజ్యవాద లక్ష్యాలను సుస్పష్టం చేస్తూ వాణిజ్య పంటలపై దృష్టి సారించింది తప్ప సాంకేతిక పురోగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీని ఫలితంగా భారత వ్యవసాయం తీవ్ర సంక్షోభం లోకి నెట్టబడింది.

విషయం:
1. బ్రిటీషు ప్రయోజనాలపై దృష్టి
a. వాణిజ్యీకరణ భారత అభివృద్ధి కొరకు కాకుండా, బ్రిటిష్ పరిశ్రమలకు ముడి సరుకులు అందించేందుకు ప్రధానంగా రూపొందించబడింది.
b. 19వ శతాబ్దం చివరి నాటికి వాణిజ్య పంటలు (పత్తి, నీలిమందు, అఫీము, జనపనార) సుమారు 30% సాగు భూమిని ఆక్రమించాయి.
c. నీటిపారుదల, మౌలిక సదుపాయాలలో ఎలాంటి పురోగతి జరగలేదు.
2. సాంకేతిక పురోగతి లేకపోవుట
a. సాధనాలు: చెక్క నాగళ్ళు, కొడవళ్లు, ఎడ్లబండ్ల వాడకం కొనసాగింది.
b. నీటిపారుదల సదుపాయాలపై బ్రిటీషువారు దృష్టి సారించకపోవడంతో 75% కంటే ఎక్కువగా వ్యవసాయ రంగం వర్షాలపై ఆధారపడింది.
c. 20వ శతాబ్దం వరకు శాస్త్రీయ పరిశోధనలను కాని ఉత్తమ పద్ధతులను గాని ప్రవేశపెట్టలేదు.
d. దీనికి విరుద్ధంగా, ఐరోపాలో వేగవంతమైన యాంత్రీకరణ మరియు పంట దిగుబడి మెరుగుదల కొనసాగింది.
3. ఆర్ధిక దోపిడీ మరియు కఠినమైన రుణ వ్యవస్థలు
a. శాశ్వత శిస్తు మరియు రైత్వారీ విధానాలు ఉత్పాదకతతో సంబంధం లేకుండా అధిక భూమి శిస్తు వసూలుకు దారితీశాయి.
b. నూతన పద్దతులపై రైతులు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేకపోయింది.
c. దక్కన్‌ ప్రాంతంలో లో వడ్డీ వ్యాపారుల వడ్డీ రేట్లు సంవత్సరానికి 25–50% ఉండేవి.
d. రుణ బానిసత్వం మరియు భూముల అన్యాక్రాంతం సాధారణంగా కొనసాగింది.
4. ఆహార భద్రత క్షీణత మరియు కరువు కాటకాలు
a. వాణిజ్య పంటలు ఆహార పంటల సాగును వెనక్కి నెట్టి, ప్రజల జీవనాధారంపై దెబ్బ కొట్టాయి.
b. 1850 నుండి 1900 వరకు 20 కంటే ఎక్కువ ప్రధాన కరువులు సంభవించి, 15–20 మిలియన్ల మంది ప్రజల మరణాలకు కారణమయ్యాయి.
c. పంటల వైవిధ్యం మరియు నీటిపారుదల సదుపాయాలు లేకపోవడం సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది.
5. సంస్థాగత సహాయం అందకపోవడం
a. 19వ శతాబ్దంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధన కేంద్రాలు స్థాపించబడలేదు.
b. మొదటి కరువు కమిషన్ (1880) సంస్కరణలకు బదులుగా పరిహారాలపై దృష్టి సారించింది.
c. సహకార సంఘాలు మరియు గ్రామీణ రుణ సంస్కరణలు 20వ శతాబ్దంలోనే ప్రవేశపెట్టబడ్డాయి.

ముగింపు
బిపిన్ చంద్ర వ్యాఖ్యానించినట్లు, వలసవాద వాణిజ్యీకరణ భారత వ్యవసాయరంగ సంక్షోభానికి కారణమయింది. అంతేకాకుండా ఈ విధానాల వలన బ్రిటిష్ వారికి ఆర్థికంగా మేలు జరిగినప్పటికీ, భారతీయ వ్యవసాయ రంగం సాంకేతికంగా ఎటువంటి పురోగతిని సాధించకుండా బలహీనంగా మిగిలిపోయింది.

Additional Embellishment: