TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Wed Apr 23, 2025

Q. సింధు మరియు వైదిక నాగరికతల ముఖ్య లక్షణాలను సరిపోల్చి, వాటి మధ్య గల తేడాలను విశ్లేషించండి.

పరిచయం:
సింధు నాగరికత పట్టణ అభివృద్ధి మరియు హస్తకళా నైపుణ్యానికి వేదిక అవగా, వైదిక నాగరికత గ్రామీణ జీవనం మరియు వైదిక క్రతువులకు ప్రాముఖ్యత అందించింది. ప్రాచీన భారత దేశ చరిత్రలో పట్టణ జీవనశైలికీ మరియు గ్రామీణ సామాజిక మరియు ఆధ్యాత్మిక యుగానికీ మధ్య వారధిగా ఈ నాగరికతల కాలాన్ని చెప్పవచ్చు.

విషయం: 
సింధు నాగరికత మరియు వైదిక నాగరికత మధ్య సారూప్యతలు

అంశం
సింధు నాగరికత
వైదిక నాగరికత
వ్యవసాయం
హరప్పా వద్ద గోధుమ, బార్లీ వంటి పంటలతో వ్యవసాయం సాగింది.
తరువాతి వైదిక కాలంలో కూడా వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉండేది. వైదిక గ్రంథాలలోని నాగలి ప్రస్తావనలు దీనిని సమర్థిస్తున్నాయి.
జంతువులు
ఎద్దులు మరియు ఇతర జంతువులు ప్రాముఖ్యతను కలిగి ఉండేవి. వీటిని హరప్పా ముద్రికలపై కూడా చూడవచ్చు.
గోవులకు ప్రాముఖ్యత ఉండేది. ధనవంతుడిని ‘గోమత్’ అని పిలవడం దీనికి ఉదాహరణ.
ప్రకృతి ఆరాధన
రావి చెట్టు, నదులు, అమ్మ తల్లిని పూజించారు.
అగ్ని, ఇంద్ర, వరుణ వంటి ప్రకృతి దేవతలను ఆరాధించారు.
చిహ్నాలు
స్వస్తిక్, ముద్రికలు, మూపురం గల ఎద్దు, మొదలైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది
యజ్ఞ యాగాదులు, వైదిక క్రతువులకు అధిక ప్రాముఖ్యత ఉండేది.

సింధు నాగరికత మరియు వైదిక నాగరికతల మధ్య వ్యత్యాసాలు

అంశం
సింధు నాగరికత
వైదిక నాగరికత
కాలం
పురావస్తు ఆధారాల ప్రకారం క్రీ.పూ. 2600–1900 మధ్య కాంస్య యుగంలో అభివృద్ధి చెందింది.
వైదిక గ్రంథాల ప్రకారం క్రీ.పూ. 1500–600 మధ్య విస్తరించింది.
నగరీకరణ
గ్రిడ్ నమూనా, డ్రైనేజీ వ్యవస్థలతో మొహెంజోదారో వంటి విశాల నగరాలు ఏర్పడ్డాయి.
తొలి వైదిక కాలంలో గ్రామీణ సంచార జీవనం, మలివేద కాలంలో హస్తినాపురం వంటి నగరాల అభివృద్ధి.
రాజకీయ పరిస్థితులు
ధోలావీరా వంటి నగరాల నిర్మాణం ఆధారంగా కేంద్రీకృత పాలనకు ఆధారాలు.
తొలి వేదకాలంలో సభ, సమితుల పాలన; తరువాత వంశపారంపర్య రాజ్యాల ఏర్పాటు.
ఆర్థిక వ్యవస్థ
మెసొపొటేమియాతో విదేశీ వాణిజ్యం, తూనికలు, ముద్రల ఆధారంగా వ్యాపార వ్యవస్థ.
గోవులు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మలివేద కాలంలో ఇనుప సాధనాల ద్వారా స్థిర వ్యవసాయం.
సామాజిక నిర్మాణం
శక్తివంతమైన రాజవంశాలు లేకుండా సమానత్వం ఆధారంగా ఉండేదిగా అనిపిస్తుంది
వర్ణవ్యవస్థ ప్రారంభం (పురుష సూక్తం), తరువాత కులవ్యవస్థగా మారింది.
మతం
అమ్మతల్లి, పశుపతి (ప్రోటో-శివ) ఆరాధన.
అగ్ని, ఇంద్ర, వరుణ ఆరాధన; యజ్ఞాల ద్వారా బ్రాహ్మణాధిపత్యం.
లిపి & సాహిత్యం
సర్పలేఖన లిపి ఉన్నా చదవలేని స్థితి; గ్రంథాలు లభించలేదు.
ఋగ్వేదం మొదలైన సంస్కృత సాహిత్య గ్రంథాలు.
సాంకేతికత
కాంస్య సాధనాలు, తూనికలు, కొలతలు వంటి వాణిజ్య పరంగా సాంకేతిక అభివృద్ధి.
ఇనుప సాధనాలు - వ్యవసాయం, యుద్ధాలలో వినియోగం.
సాంస్కృతిక ప్రాముఖ్యత
ముద్రికలు, టెర్రకోట బొమ్మలు, హస్తకళల అభివృద్ధి.
స్తోత్రాలు, బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషత్తుల ద్వారా మౌఖిక సాంస్కృతిక ప్రసారం.

ముగింపు:
ఈ రెండు నాగరికతలు ప్రాచీన భారతదేశం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని అందిచడమేగాక సింధు నాగరికతకు సంబందించి నేటికీ జరుగుతున్న తవ్వకాలు ఇప్పటికీ కొత్త విషయాలను వెల్లడిస్తునే ఉన్నాయి. అంతేకాకుండా, వేదకాలం నాటి ఆలోచనలు, నైతిక విలువలు, మరియు ఆచారాలు ఈ రోజుకి కూడా భారత సమాజంపై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి అనడానికి మన రోజువారీ జీవన విధానాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Additional Embellishment: