TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Thu Apr 24, 2025

Q. సూఫీతత్వాన్ని వివరించండి. అలాగే దాని ప్రధాన సిద్ధాంతాలు, ముఖ్యమైన సూఫీ సిల్ సిలలు (సూఫీ లో వివిధ శాఖలు) మరియు భారత సమాజంపై వాటి ప్రభావాన్ని చర్చించండి.

పరిచయం:
సూఫీవాదాన్ని “ఇస్లాం మరియు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల మధ్య వారధి” అని ప్రముఖ చరిత్రకారుడు కె.ఎ. నిజామీ వర్ణించారు. క్రీ.శ 8వ–9వ శతాబ్దంలో ఇస్లాం మతసంస్కరణోద్యమంగా ఆవిర్భవించిన ఈ సూఫీవాదం విభిన్న సమాజాలను ఒక తాటిన కట్టడంలో కీలక పాత్రను పోషించడమే గాక, కఠినమైన ఆచారాల కంటే ఆధ్యాత్మికత, మానవత్వం, మరియు విశ్వ మానవ సౌబ్రాతృత్వాలకు ప్రాధాన్యతను ఇచ్చింది.

విషయం:
సూఫీవాద తత్వం

1. సూఫీవాదం పూర్తిగా ఉదారవాద, మరియు మానవతావాద దృక్పథాన్ని కలిగి ఉంటుంది.
2. మతాలు వేరు అయినా వాటి అంతిమ లక్ష్యం ఒక్కటే అని బోధించింది.
3. మత రుఢివాదాన్ని తిరస్కరించి, ఆచార వ్యవహారాల కంటే ఆధ్యాత్మికతపై దృష్టి సారించింది.
4. యాంత్రిక జీవనం, భౌతికవాడాలను తిరస్కరించి, వైరాగ్యం మరియు ఆధ్యాత్మికత సాధనను ప్రచారం చేసింది.
5. మానవుల మద్య ప్రేమ (ఇష్క్) మరియు సహనాన్ని ప్రచారం చేసింది.
సూఫీవాదం యొక్క ప్రధాన సూత్రాలు
1. తవక్కుల్: దేవునిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం.
2.
జుహ్ద్ : లౌకిక సుఖాలను త్యాగం చేయడం.
3.
ఇష్క్-ఎ-ఇలాహీ: దేవుడిపై గల ప్రేమను సర్వోన్నత mainadi గా భావించడం.
4.
తౌహీద్-e -వజుది: విశ్వ మానవ సౌబ్రాతృత్వం (ఇబ్న్ అరబీ రూపొందించినది).
5.
మానవ సేవ: పేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం.
6.
పీర్-మురీద్ సంప్రదాయం: గురు-శిష్యుల మధ్య బలమైన బంధం.
7.
సమా మరియు జిక్ర్: సంగీతం మరియు ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక సాధన.త్మపరిశీలన, కోరికల నియంత్రణ, మరియు ఏకేశ్వర ఉపాసన సూఫీతత్వంలోని ఈ విధమైన సిద్ధాంతాలు స్థానిక భారతీయ సంప్రదాయాలతో సులభంగా కలిసిపోతూ మతభేదాలు మరియు సామాజిక వర్గ బేధాలను అధిగమించి సామాన్య ప్రజలకు సులభంగా చేరువ అయింది.
భారతదేశంలో ప్రముఖ సూఫీ సంస్థలు (సిల్సిలాలు)

సంస్థ
స్థాపకుడు / కేంద్రం
ప్రధాన లక్షణాలు
ఛిష్తీ సిల్సిలా
ఖ్వాజా మొయినుద్దీన్ ఛిష్తీ – అజ్మీర్
సమ, దాతృత్వం, ప్రజలతో సన్నిహిత సంబంధం
సుహ్రవర్దీ సిల్సిలా
బహాఉద్దీన్ జకరియా – ముల్తాన్
రుఢివాదం, రాజసంబంధాలు
కాదిరీ సిల్సిలా
షా నియాజ్ అహ్మద్
షరియా పాటింపు, దక్షిణ భారతంలో వ్యాప్తి
నక్షబందీ సిల్సిలా
ఖ్వాజా బాకీ బిల్లా
సమాకు వ్యతిరేకం, సున్నీ సంప్రదాయం, కట్టుబాటు ఉన్న జీవన శైలి

భారతీయ సమాజంపై సూఫీవాద ప్రభావం
1. మత సామరస్యానికి ప్రోత్సాహం
a. నిజాముద్దీన్ ఔలియా వంటి సూఫీ సాధువులు “హిందూ-ముస్లిం ఐక్యత దేవుని సంకల్పం” అని బోధించారు. వారి ఖాన్కాలు అన్ని కులాలు మరియు మతాల ప్రజలను స్వాగతించాయి. సామాజిక సామరస్యాన్ని (గంగా-జమునీ తహజీబ్) ప్రోత్సహించాయి. ప్రముఖ చరిత్రకారుడు కె.ఎ. నిజామీ సూఫీవాదాన్ని “ఇస్లాం మరియు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల మధ్య వారధి” అని వర్ణించాడు.
2. స్థానిక భాషల అభివృద్ధి
b. అమీర్ ఖుస్రు వంటి సూఫీ కవులు పర్షియన్, హిందవీ మరియు ప్రాథమిక భాషలు కలగలిపి హిందుస్తానీ భాషకు పునాది వేయడమేగాక, కవ్వాలీ సంగీతాన్ని కూడా ప్రోత్సహించారు. అతని ప్రసిద్ధ ద్విపద గ్రంథమైన — “హిందవీ చక్కెరలా తీపిగా ఉంటుంది” (Hindavi as sweet as sugar)— భాషాపరమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది.
3. దాతృత్వ కేంద్రాల స్థాపన
c. సూఫీ ఖాన్‌కాలు సామాజిక సేవా కేంద్రాలుగా మారాయి. అవి లంగర్‌లను (ఉచిత భోజనశాలలు) నడిపించి, ప్రతిరోజూ వేలాది మందికి ఆహారం అందించాయి. మొయినుద్దీన్ చిష్టీని ఆయన దాతృత్వ కార్యక్రమాల కారణంగా "గరీబ్ నవాజ్" (పేదల దాత) అనే బిరుదు లభించింది.
4. భక్తి ఉద్యమంతో సారూప్యత
d. సూఫీ సిద్ధాంతాలు భక్తి గురువులు అయిన కబీర్, గురు నానక్, రవిదాస్ వంటి వారిని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈ రెండు ఉద్యమాలు కూడా కులవ్యవస్థను తిరస్కరిస్తూ, ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించాయి. సూఫీలో “వహ్‌దత్ ఉల్ వుజూద్” (దైవత్వ ఐక్యత), భక్తిలో “అద్వైత భావన” కీలకమైనవిగా చెప్పవచ్చు.
5. కళ, సంగీతం & వాస్తుశిల్పంపై ప్రభావం
e. సూఫీవాదం ద్వారా కవ్వాలీ, సమా వంటి సంగీత రూపాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నిజాముద్దీన్ ఔలియా దర్గా, అజ్మీర్ షరీఫ్ వంటి నిర్మాణాలు హిందూ-ఇస్లామీయ శైలుల్లో నిర్మితమయ్యాయి. ప్రముఖ చరిత్రకారుడు రిచర్డ్ ఈటన్, సూఫీ దర్గాలను *“అన్ని మతాల యాత్రికుల ఆదరణ పొందిన కేంద్రములు”*గా పేర్కొన్నారు.

ముగింపు
సూఫీవాద సమ్మిళిత సందేశమైన—ప్రేమ, శాంతి, సమానత్వాలు—భారతదేశం యొక్క బహుసాంస్కృతిక జీవన విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. నేటికీ, అజ్మీర్ షరీఫ్ వంటి సూఫీ దర్గాలలో జరిగే ఉర్స్ ఉత్సవాలు అన్ని మతాల భక్తులను ఆకర్షిస్తాయి. సమకాలీన భారతదేశంలో సామాజిక సామరస్యానికి ఉదాహరణగా ఈ ఉత్సవాలను పేర్కొనవచ్చు.

Additional Embellishment: