TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Tue May 20, 2025

Q: బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాలను సమగ్రంగా వివరిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని విశ్లేషించి అంచనా వేయండి.

పరిచయం:
1765లో దివాణీ హక్కులు పొందిన తర్వాత, బ్రిటిష్ వారు భూమి శిస్తు విధానాలను అమలు చేశారు. ఎంతో కఠినమైన ఈ విధానాల వల్ల ఆనాటికి స్వయం సమృద్ధిగల భారతీయ రైతాంగం కౌలుదారులుగా, రుణగ్రస్తులుగా, మరియు భూమిలేని వ్యవసాయ కూలీలుగా మారారు. అంతేకాకుండా తద్వారా భారత దేశ వ్యవసాయ రంగం క్రమంగా క్షీణించసాగింది.

విషయం:

భూ శిస్తు విధానం
ప్రవేశపెట్టిన వ్యక్తి/ సంవత్సరం
ప్రవేశపెట్టబడిన ప్రదేశం
ముఖ్య లక్షణాలు
జమీందారీ విధానం / శాశ్వత శిస్తు నిర్ణయ విధానం

లార్డ్ కార్న్‌వాలిస్ (జాన్ షోర్ రూపొందించారు), 1793


బెంగాల్, బీహార్, ఒడిశా, తూర్పు ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్


-జమీందారులకు భూమి పై వారసత్వ యాజమాన్య హక్కుల కల్పన

-శాశ్వతంగా నిర్ణయించబడిన ఆదాయం.

-వాటా: 10/11 వ వాటా బ్రిటిష్ వారికి, 1/11 భాగం జమీందారులకు.

-రైతులు క్రమంగా కౌలుదారులుగా మారారు.

-అధిక మొత్తంలో శిస్తు వసూలు, గైర్హాజరీ భూస్వామ్య విధానం/ పరోక్ష భూయాజమాన్య విధానం.
రైత్వారీ విధానం
సర్ థామస్ మన్రో & కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్, 1820 (అధికారికంగా ప్రవేశపెట్టబడినది)

మద్రాస్, బొంబాయి, అస్సాం, బేరార్, కూర్గ్, తూర్పు పంజాబ్


-రైతుల నుండి నేరుగా శిస్తు వసూలు.
-రైతులకు భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు.
-మధ్యవర్తులు (జమీందారులు) లేరు.
-కాలానుగుణంగా భూశిస్తు లో మార్పులు
-అధికారులు మరియు వడ్డీ వ్యాపారుల దోపిడీ.


మహల్వారి విధానం
1822 - హోల్ట్ మాకెంజీ (లార్డ్ విలియం బెంటింక్ ప్రోత్సాహంతో; 1833లో సవరించబడింది

వాయవ్య ప్రాంతాలు, అవధ్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో కొన్ని భాగాలు


-మొత్తం గ్రామం (మహల్) నుండి శిస్తు వసూలు.

-గ్రామ పెద్ద ద్వారా పన్ను వసూలు.

-సామూహిక/సంయుక్త భూయాజమాన్యం కొనసాగింది.

-కాలానుగుణంగా శిస్తు సవరణ.
-
తప్పుడు సర్వేలు మరియు అవినీతి.

భారత ఆర్థిక వ్యవస్థపై భూమి ఆదాయ విధానాల ప్రభావం సానుకూల ప్రభావాలు
1. పరిపాలనా సరళీకరణ: 
-భూమి రికార్డులు మరియు కట్టుదిట్టమైన పన్ను విధానాలు ప్రవేశపెట్టడబడటంతో శిస్తు వసూలు సులభతరం గా మారింది.
2. రైతులకు భూమిపై హక్కులు:
-
రైత్వారీ విధానం రైతులకు భూమిపై పూర్తి హక్కు కల్పిస్తూ జమీందారుల దోపిడీ లేకుండా చేసింది.
3. సామూహిక భూ యాజమాన్య వ్యవస్థల రక్షణ: 
-మహల్వారీ విధానం గ్రామ సామూహిక వ్యవస్థలను కొంతవరకు బలపరచగలిగింది.
ప్రతికూల ప్రభావాలు
1. రైతాంగంలో పేదరికం పేరుకుపోవడం: 
-అధిక శిస్తు డిమాండ్ల వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయి, భూమిలేని కూలీలుగా మారారు.
2. సాంప్రదాయ హక్కులకు నష్టం: 
-జమీందారీ విధానంలో రైతులు తమ సాంప్రదాయ మరియు భూ యాజమాన్య హక్కులను కోల్పోయారు.
3. దోపిడీ: 
-పన్ను/కౌలు చెల్లించలేకపోతే రైతులను తమ భూముల నుండి వెళ్లగొట్టేవారు.
4. మధ్యవర్తుల ఆధిపత్యం: 
-జమీందారులు మరియు వడ్డీ వ్యాపారులు ధనవంతులై, రైతులు ఇబ్బందుల్లో పడ్డారు
.5. కరువుకాటకాలు: 
-కఠినమైన పన్ను వసూళ్ల వల్ల పంటలు విఫలమై, ఆహార కొరతతో, గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.

ముగింపు:
బ్రిటిష్ భూమి శిస్తు విధానాలు గ్రామీణాభివృద్ధికి బదులుగా ఆంగ్లేయుల ఆదాయ వృద్ధిపై దృష్టి సారించాయి. ఈ విధానాల ప్రభావం కారణంగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఏర్పడిన తొలి ప్రభుత్వాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వం కోసం భూసంస్కరణలు, సంస్థాగత రుణ వ్యవస్థలు, మరియు వ్యవసాయ విధానాల సంస్కరణలను చేపట్టాయి.

Additional Embellishment: