There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ పెట్టుబడుల ప్రాంతాలు (ITIRs) మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZs) రాష్ట్రాన్ని భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ ఎగుమతిదారుగా నిలిపాయి. 2023-24 సంవత్సరంలో ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతులు ₹2.41 లక్షల కోట్లను అధిగమించి, భారతదేశ ఐటీ ఎగుమతులలో 12% వాటాను సాధించాయి. హైదరాబాద్‌లోని నాలెడ్జ్ కారిడార్ చుట్టూ కేంద్రీకృతమైన ఈ మండలాలు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన మరియు ప్రపంచ ఆర్థిక సమైక్యతకు ప్రధాన చోదక శక్తులుగా మారాయి.
విషయం:
A. తెలంగాణల ITIR మరియు SEZల ప్రాముఖ్యత
1. అధిక సాంకేతికత గల పరిశ్రమల సమూహాభివృద్ధి
a. ITIR హైదరాబాద్ మొదటి దశలో (సైబరాబాద్ నుండి గచ్చిబౌలి కారిడార్) మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలను ఆకర్షించింది.
b. హైదరాబాద్ ఫార్మా సిటీ మరియు ఫాబ్ సిటీ వంటి SEZలు బయోటెక్, ఫార్మా మరియు సెమీకండక్టర్ పరిశ్రమలలో ప్రత్యేకత సాధించాయి.
2. మౌలిక సదుపాయాల ఆధారిత పారిశ్రామికీకరణ
a. ఔటర్ రింగ్ రోడ్ (ORR), HMDA మాస్టర్ ప్లాన్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు SEZలు/ITIRలకు మద్దతునిస్తున్నాయి.
b. ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు, ప్రత్యేక విద్యుత్ గ్రిడ్లు వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతున్నాయి.
3. విధాన సమన్వయం
a. ITIR మరియు SEZలు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా మరియు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వీయ- ధ్రువీకరణ (TS-iPASS) వంటి విధానాలతో సమన్వయం కలిగి ఉన్నాయి.
b. ఆర్థిక ప్రోత్సాహకాలు: 100% FDI, SEZ చట్టం, 2005 కింద పన్ను మినహాయింపులు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
4. ఎగుమతి ప్రోత్సాహం
a. తెలంగాణ ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతులు 2023-24లో ₹2.41 లక్షల కోట్లను దాటాయి. ఇందులో DLF IT, మైండ్‌స్పేస్ వంటి SEZలు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి.
b. జీనోమ్ వ్యాలీ నుండి జరిగే ఫార్మా ఎగుమతులు భారతదేశాన్ని ఫార్మా హబ్‌గా నిలబెట్టాయి.
5. సమతుల్య ప్రాంతీయ వృద్ధి
-మహేశ్వరం హార్డ్‌వేర్ పార్క్ వంటి SEZలు పట్టణ సమీప మరియు గ్రామీణ ప్రాంతాలకు పారిశ్రామికీకరణను విస్తరించి, హైదరాబాద్ పై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి.
B. పారిశ్రామిక వృద్ధి మరియు ఉపాధి కల్పన
1. వేగవంతమైన పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి
-తెలంగాణ GSDP (పరిశ్రమ)లో 2018-23 మధ్య CAGR 12.8% వృద్ధిని నమోదు చేసింది. ఇందుకు ITIRలు మరియు SEZలు తోడ్పడ్డాయి.
2. విస్తృత ఉపాధి కల్పన
-2023-24లో ఐటీ/ఐటీఈఎస్ రంగంలో 8.7 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ , టెక్ మహీంద్రా వంటి యూనిట్ల నుండి ఈ ఉద్యోగాల కల్పన జరిగింది.
3. MSME సంబంధాలు మరియు స్టార్టప్ వ్యవస్థ
a. SEZల చుట్టూ సహాయక యూనిట్లు (ఉదా., ఎలక్ట్రానిక్ సిటీ SEZ చుట్టూ హార్డ్‌వేర్ విభాగాలు) వృద్ధి చెందాయి.
b. హైదరాబాద్‌లోని T-హబ్ మరియు WE-హబ్ వంటివి SEZ-ITIR వాతావరణాన్ని ఉపయోగించి 3,000పైగా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి.
4. నైపుణ్యాభివృద్ధి మరియు ప్రతిభా విస్తరణ
-SEZ కంపెనీలతో TASK (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) భాగస్వామ్యం ద్వారా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి.
5. ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ
-తెలంగాణ 2014-24 మధ్య ₹2.46 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో ఎక్కువ భాగం SEZలు మరియు ITIR-సంబంధిత పెట్టుబడులు (ఉదా., కొంగరకలాన్ లో ఫాక్స్‌కాన్ ఏర్పాటు) ఉన్నాయి...
ముగింపు:
తెలంగాణ సమాచారం మరియు కమ్యూనికేషన్ విధానం (ICT విధానం) 2021-26 ద్వారా మద్దతు పొందిన ITIRలు మరియు SEZలు పారిశ్రామిక వైవిధ్యం మరియు ఉపాధి కల్పనకు మార్గాలుగా ఆవిర్భవించాయి. నీతి ఆయోగ్ గుర్తించిన ప్రముఖ ఆవిష్కరణ కేంద్రంగా హైదరాబాద్, వరంగల్ మరియు కరీంనగర్ వంటి రెండవ స్థాయి నగరాలతో కలిసి, తెలంగాణను స్థిరమైన, వికేంద్రీకృత మరియు ప్రపంచ స్థాయిలో పోటీపడే పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తోంది. ఇందులో అన్ని రంగాల విస్తృతమైన అభివృద్ధి స్పష్టంగా