There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Fri Apr 4, 2025
పరిచయం:
జైన బౌద్ధ మతాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మొదలయిన శ్రమణ ఉద్యమంలో భాగంగా ఆవిర్భవించాయి. ఇవి వైదిక క్రతువులను మరియు సమకాలీన సామాజిక అసమానతను సవాలు చేయడమే కాకుండా నైతిక జీవన విధానం, త్యాగం, మరియు సమానత్వ సిద్ధాంతాలను ప్రతిపాదించి భారతీయ తత్వశాస్త్రంపై గణనీయమైన ప్రభావం చూపాయి.
విషయం:
బౌద్ధమత ముఖ్య లక్షణాలు:
1. మాధ్యమిక వాదం: కఠిన జీవన శైలి మరియు ఆర్భాట జీవనశైలికి మధ్య మధ్యే మార్గాన్ని ప్రతిపాదించింది.
2. చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గాలు, అశాశ్వతవాద (అనిశ్చతి) ఆలోచనలపై పై దృష్టి పెట్టింది.
3. ఆత్మ సిద్ధాంతాన్ని (అనత్త) మరియు కర్మ కర్మకాండలను తిరస్కరించింది.
4. వర్ణ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, అన్ని కులాల జనులకూ మరియు స్త్రీలకూ సమప్రాధాన్యత కల్పించింది.
5. శ్రమణ సిద్ధాంతాలకు కట్టుబడి, బౌద్ధ సంఘం ద్వారా మత ప్రచారం చేసింది.
6. సామాన్యులకు చేరువ కావడానికై పాలి భాషలో బౌద్ధ సాహిత్య రచన జరిగింది.
బౌద్ధమత ప్రభావం:
1. నైతికత, స్వేచ్ఛ, సమానత్వాలను బోధించిన తొలి మతంగా నిలిచింది.
2. బౌద్ధమతం ఆసియావ్యాప్తంగా వ్యాపించి, కళ, శిల్పకళ, పాలనపై ప్రభావం చూపింది.
3. అశోకుడు, కనిష్కుడుల వంటి రాజుల మద్దతుతో విద్యా సంస్థల అభివృద్ధికి దోహదపడింది (ఉదా: నలందా).
కానీ మత వ్యాప్తికి ఎంతగానో కావాల్సిన రాజాదరణను కోల్పోవడం, వైదిక మతాలు తిరిగి పుంజుకోవడం , మరియు అంతర్గత కలహాల కారణంగా భారతదేశంలో బౌద్ధం క్షీణించింది.
1. అహింసా మరియు కఠినాతి కఠినమైన జీవనశైలి మీద విశ్వాసం.
2. శాశ్వతమైన ఆత్మ (జీవ) మరియు కర్మ సిద్ధాంతాలకు మద్దతునిచ్చింది.
3. సత్యం, అహింస, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం, అలౌకికత, కఠినమైన నైతిక జీవన శైలి మొదలైన అంశాలకు ప్రాధాన్యతను అందించింది.
4. అర్ధమాగధీ ప్రాకృత భాషలో బోధన జరిగింది. జైన మతం ప్రారంభంలో అన్ని వర్గాల వారికీ చేరదలచినా, తరువాత జాతి, లింగ పరిమితులు ఏర్పడడంతో కాలక్రమేణా క్షీణించింది.
జైనమత ప్రభావం:
1. వ్యాపార వర్గాల్లో నైతిక విలువల అభివృద్ధికి దోహదపడింది.
2. శ్రావణబెళగొళ, మౌంట్ అబూ వంటి జైన కేంద్రాలలో శిల్పకళ మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించింది.
3. విస్తృత జనాదరణ పొందకపోయినా, ప్రాంతీయ స్థాయిలో స్థిరంగా కొనసాగింది
4. ప్రాకృత భాష, దేవాలయ సంప్రదాయాల అభివృద్ధికి తోడ్పడింది..
ముగింపు:
జైన బౌద్ధమతాల రెండింటిలోనూ ముఖ్యమైన లక్షణంగానున్న అహింసా సిద్ధాంతం, భారత స్వాతంత్య్ర పోరాటంలో శక్తివంతమైన రాజకీయ సిద్ధాంతంగా అవతరించింది. ప్రస్తుత ప్రపంచం హింస, అన్యాయం మరియు కాలుష్యం మొదలైన సవాళ్లపై సాగిస్తున్న పోరాటంలో అహింసావాదాన్ని ఒక ముఖ్యమైన పరిష్కార మార్గంగా చెప్పవచ్చు