APPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES
Thu Apr 3, 2025

Q. ఋగ్వేద కాలం నుండి మలి వేద కాలం వరకు సమాజం మరియు ఆర్థిక రంగాలలో చోటుచేసుకున్న ప్రధాన మార్పులను సవివరంగా విశ్లేషించండి.

పరిచయం:
సుమారు క్రీ.పూ 1000 వ నాటికి ఇనుము (కృష్ణ ఆయస్) కనుగొనబడడంతో తొలివేద కాలం పూర్తయి భారత చరిత్ర మలివేద కాలానికి అడుగులు వేసింది. ఈ చారిత్రక ఆవిష్కరణ కారణంగా సమాజం, ఆర్థిక వ్యవస్థ, పాలన మొదలైన విషయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

విషయం:
సమాజంలో వచ్చిన మార్పులు:

విషయం
తొలివేద కాలం (ఋగ్వేద కాలం)
మలివేద కాలం
వర్ణ వ్యవస్థ
సమ సమాజ లక్షణాలతో భేదభావం తక్కువగా ఉండేది. వర్ణ అసమానతలు కఠినంగా అమలు అయ్యేవి కావు.
వర్ణవ్యవస్థ కఠినంగా మారింది. బ్రాహ్మణులు, క్షత్రియులు గౌరవింపబడేవారు. శూద్రులపై వివక్ష ఉండేది.
స్త్రీల స్థానం
స్త్రీలకు సముచిత స్థానం ఉండేది. చదువుకోడానికి, సభలు-సమితుల్లో పాల్గొనడానికి అవకాశం ఉండేది.
ఉదాహరణలు: గార్గి, మైత్రేయి
సమాజం లో స్త్రీల స్థానం దిగజారింది. బాల్య వివాహాలు, సతీసహగమనం లాంటి దురాచారాలు మొదలయ్యాయి. చదువుపై ఆంక్షలు విధించబడ్డాయి.
కుటుంబం, బంధుత్వం
ఉమ్మడి, చిన్న కుటుంబాలు రెండూ ఉండేవి. పితృస్వామ్యం మితంగా ఉండేది.
పితృస్వామ్యం బలపడింది. పెద్దకొడుకుకే ఆస్తిహక్కులు లభించే ప్రథమ వారసత్వ విధానం (ప్రైమోజెనిచర్ విధానం) అమలులోకి వచ్చింది
రాజ్యాధికారం, యజ్ఞాలు
రాజన్ సభ, సమితుల సాయంతో పాలన సాగించేవారు.
రాజ్యాధికారం వారసత్వంగా మారింది. రాజులు అశ్వమేధ, రాజసూయ వంటి యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహించేవారు.
గోత్రం, ఆశ్రమ వ్యవస్థ
తొలివేద కాలంలో ఇలాంటివి ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
గోత్రం, చతురాశ్రమ ధర్మాలు (బ్రహ్మచర్యం, గృహస్థం మొదలైనవి) సమాజంలో భాగమయ్యాయి.
మత పరిస్థితులు
ఇంద్ర, అగ్ని, వరుణుడు వంటి ప్రకృతి దేవతలను సులభమైన రీతిలో పూజించేవారు.
మలివేద కాలంలో యజ్ఞయాగాలు, క్రతువులు, అధిక వ్యయ ప్రయాసలు పెరిగి ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ప్రజాపతి, విష్ణు, రుద్రుని వంటి దేవతలకు ప్రాధాన్యత పెరిగింది. బ్రాహ్మణులు ప్రధాన పూజారులయ్యారు.

ఆర్థిక వ్యవస్థలో మార్పులు:

విషయం
తొలివేద కాలం (ఋగ్వేద కాలం)
మలివేద కాలం
వ్యవసాయ అభివృద్ధి
పశుపోషణ (గోపాలన) ప్రధానమైనది. వ్యవసాయం అంత ప్రాధాన్యత ఉండేది కాదు.
ఇనుము పనిముట్ల ఆవిష్కరణతో గంగా-యమునా ప్రాంతంలో వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగింది.
భూమి యాజమాన్యం
భూమి సమూహ యాజమాన్యంలో ఉండేది. ఈ కాలం నాటి ఆర్యుల ఆర్ధిక అంతస్థును నిర్ణయించేవి వాళ్ళ వద్దనున్న పశువుల సంఖ్య గా చెప్పవచ్చు.
ప్రైవేట్ భూములు వచ్చాయి. బ్రాహ్మణులు, అధికారులకు రాజులు భూములు దానధర్మాలు చేసేవారు.
వాణిజ్యం
వాణిజ్యానికి ప్రాముఖ్యత తక్కువగా ఉండేది. వస్తు మార్పిడి విధానాన్ని ఉపయోగించేవారు.
నిష్క, శతమాన అనే నాణేల వాడకం మొదలయింది. పట్టణీకరణ వల్ల వ్యాపారం పెరిగింది.
వృత్తులు
వృత్తులు వర్ణాలపై ఆధారపడేవి కావు. ఎవరికైనా వృత్తి మార్పు సాధ్యమయ్యేది
వృత్తుల ఆధారంగా వర్ణ వ్యవస్థ ఏర్పడింది. వాణిజ్య శ్రేణులు (గిల్డ్స్) ఏర్పడ్డాయి. వృత్తులు వారసత్వంగా మారాయి.
పన్నులు
ప్రజలు రాజుకి స్వచ్ఛందంగా పన్ను (బలి) చెల్లించేవారు.
రాజులు ప్రజలపై పలు పన్నుల్ని విధించటం ప్రారంభించారు. ఇది ఒక వ్యవస్థగా మారింది.

ముగింపు:  
మలి వేద కాలంలో వ్యవసాయ ఆధారిత, కఠిన వర్ణ వ్యవస్థతో కూడిన సమాజం ఏర్పడింది. అత్రంజిఖేరా వంటి గ్రామాలు, కురు మరియు పాంచాల వంటి ఆకాలం నాటి ప్రాంతాలలో ఈ మార్పు సుష్పష్టంగా కనిపిస్తుంది. ఇవే తరువాతి కాలంలో కోసల, మగధ వంటి శక్తివంతమైన మహాజనపదాలకు పునాది వేసాయి.